తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడంలో ఆడ, మగ భేదం చూపటం లేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆడపిల్లల్ని కనీసం డిగ్రీ చదివించాలని గ్రామీణ భారత్ లో 78 శాతం మంది పేరెంట్స్ కోరుకుంటున్నట్లు ‘ట్రాన్స్ ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్’ తాజా సర్వేలో వెల్లడైంది. బాలుర డ్రాపవుట్లలో నాలుగో వంతు ప్రాథమిక విద్యలోనే జరుగుతున్నాయి. ఆ దశలో బాలికల డ్రాపవుట్లు 35 శాతం ఉంటున్నాయి.