తోషాఖానా కేసులో దోషిగా నిరూపితమై అటక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కారాగారంలో వసతులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన గదిలో పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని, తన న్యాయవాది నయీమ్ హైదర్ కు తెలిపారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాలని ఇమ్రాన్ తెలిపినట్లు పాక్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) వర్గాలు తెలిపాయి. ఆయన్ను అదియాల్ జైలుకు తరలించాలని కోర్టులో పీటీఐ పిటిషన్ వేసింది.