నాలుగేళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లా హింగ్నా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం రోజు తండ్రి ఇంట్లో పడుకొని ఉండగా, బాలుడు టీవీ చూస్తూ సెట్‌టాప్ బాక్సును లాగే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పటిదాకా కార్టూన్లు చూస్తూ ఆనందంగా గడిపిన చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.