ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్ సభలో చర్చలు ముగియనున్నాయి. అవిశ్వాసంపై ప్రధాని మోదీ నేడు సాయంత్రం 4 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తారు. కాగా, అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 272 మంది సభ్యుల అవసరం కాగా, ప్రస్తుతం ఎన్డీఏకు 350 మంది ఎంపీల మద్దతుంది. దీంతో అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది.