తన ప్రేమకు అడ్డొస్తాడని తండ్రిపైనే ఓ కూతురు దాడి చేయించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. సోలాపుర్ జిల్లాలోని మహేంద్ర షా పెద్ద వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి ఓ యువకుణ్ని ప్రేమించింది. ఈ క్రమంలో తండ్రి అడ్డొస్తాడని ప్లాన్ ప్రకారం నలుగురు నిందితులకు రూ.60 వేలు సుఫారీ ఇచ్చి సోమవారం రాత్రి తండ్రిపై దాడి చేయించింది. విచారించిన పోలీసులు కూతురే అసలు నిందితురాలని తేల్చారు. ఆమెతో పాటు అందర్నీ అరెస్ట్ చేశారు.