ఆరోగ్యశ్రీ క్యాన్సర్ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5 శాతం పడకలను కచ్చితంగా కేటాయించాలని ఆదేశించారు. ఐబ్రిస్ట్ స్క్రీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa