రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకొందని ఎద్దేవా చేసింది. మణిపూర్ అంశంపై సుముఖంగా లేని బీజేపీ ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతుందని ఆరోపించింది. శివసేన(యూబీటీ) నేత ప్రియాంకా చతుర్వేది సైతం రాహుల్ చర్యను సమర్థించారు. 'నేను విజిటర్స్ గ్యాలరీలో ఉన్నాను. ఆయన ఆత్మీయంగా ఆ సంజ్ఞ చేశారు. దానిలో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదు' అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa