టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమరావతి దళిత జేఏసీ నేత, తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత పులిచిన్నా జన్మదిన వేడుకలు పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని దొడ్లేరు వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను పులి చిన్నా కలిశారు. ఈ మేరకు నారా లోకేష్ పులి చిన్నా కు మిఠాయిలు తినిపించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లోకేష్ చిన్నా కు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa