దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 65,534 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 19,496 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.74 వద్ద కొనసాగుతోంది. అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.