పులికాట్ సరస్సులో చిమ్మ చీకట్లో 60 మంది విద్యార్థులతో పడవ చిక్కుకుపోయిన ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో జరిగింది. తడ మండలంలో ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్ సరస్సు మధ్యలో మొరాయించింది. వీరు తమిళనాడు పరిధిలోని సున్నాంబుగోళం తమిళ పాఠశాలకు పడవలో రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. పిల్లలు ఎప్పటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు మరో పడవలో వెళ్లి వారిని గుర్తించి తీసుకొచ్చారు.