ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో సెల్ ఫోన్ల వినియోగం నిషేధం విధించింది. పిల్లలు క్లాస్ రూంలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించింది. స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల నిద్రలేమి సమస్యలతో పాటు కంటిచూపు తగ్గుతుందని హెచ్చరించింది. టీచర్లు కూడా ఫోన్ వాడొద్దని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.