గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ అప్రమత్తం చేసింది. క్రోమ్ పాత వెర్షన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, దాంతో హ్యాకర్లు ఎంతో సులభంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. వెబ్ ఆర్టీపీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ట్రాన్స్ పోర్ట్ తదితర లోపాలను క్రోమ్ పాత వెర్షన్‌లో గుర్తించామని తెలిపింది.