ఏపీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చెన్నైలోని మాధవరం రెడ్ హిల్స్ సమీపంలో గురువారం రాత్రి కాలి బూడిదైంది. బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చి మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును నిలిపేయడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. అందరూ చూస్తుండగానే బస్సు దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలార్పారు.