వైద్యులపై రోగులు, వారి బంధువులు దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (NMCRMP) నియమావళి పేరుతో రూపొందించిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ఎన్ఎంసీ తెలిపింది. దీంతో ఇకపై వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స నిరాకరించవచ్చని తెలిపింది. వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ రూల్స్ తెస్తున్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది.