ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 వాహనాలపై దుష్ప్రచారం,,,స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 08:02 PM

ఏపీలో 108 వాహనాలపై దుష్ప్రచారం జరుగుతోందంటోంది ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే 108 ఎమర్జెన్సీ, మొబైల్‌ క్లినిక్స్‌,తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌‌లు ఉన్నాయన్నారు. ప్రతి మండలానికి కచ్చితంగా ఒకటి చొప్పున లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో 108 అంబులెన్సులు నడుస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది. కానీ ఈనాడు ఆ వాస్తవాలు ప్రస్తావించకుండా.. ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని కొందరు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


రాష్ట్రంలోని మొత్తం 104, 108, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల సంఖ్య 2,204 అని తెలిపింది. మరే రాష్ట్రంలోనూ ఇన్ని వాహనాలు ఆరోగ్య రంగంలో లేవంటే అతిశయోక్తి కాదన్నారు. సుమారు 25 కోట్లకుపైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 988 అంబులెన్సులు ఉంటే.. అంతకంటే 5 రెట్లు తక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 108 వాహనాలు 768.. యూపీ తరవాత అత్యధిక 108 వాహనాలున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్‌ ఉందని.. ఈ విషయంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, యూపీ.. ఇవన్నీ ఏపీ కంటే ఎంతో వెనకబడి ఉన్నాయన్నారు.


గత ప్రభుత్వంలో వర్కింగ్‌ కండిషన్లో ఉన్న 108 వాహనాలు కేవలం 336 మాత్రమే. కానీ ఈ ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంలో పనిచేస్తున్న 108 వాహనాల సంఖ్య 768. అంటే గత ప్రభుత్వంలో సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రెండు మండలాలకు కనీసం ఒక్కటి కూడా 108 వాహనం లేదు. కానీ ఈ ప్రభుత్వంలో మండలానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో 108 వాహనాలు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రతిరోజూ సగటున 3,089 మంది 108 సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో.. అప్పుడే పుట్టిన చిన్నారులకు ఉద్దేశించిన నియోనాటల్‌ అంబులెన్సులు లేనేలేవు. కానీ ఈ ప్రభుత్వం 26 నియోనాటల్‌ అంబులెన్సులు తీసుకొచ్చిందన్నారు.


ఈ ప్రభుత్వం వచ్చాక 104 వాహనాలను భారీగా 936కు పెంచిందని.. 104, 108 వాహనాల నిర్వహణ కోసం ఏడాదికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.334.72 కోట్లుగా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో 279 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 500కు పెంచారన్నారు. 108 వాహనాలు నిరంతరం కండిషన్లో ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది అన్నారు. అలాగే సుదీర్ఘకాలం ప్రయాణంచేసి, కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్తవాటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతోందన్నారు. 2023లో.. 2.5 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి, వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.


108 అంబులెన్సుల నిర్వహణ కోసం ఏడాదికి ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.172.68 కోట్లు కాగా.. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మొత్తంగా ఒక ఏడాదిలో 108 వాహనాల కోసం చేస్తున్న ఖర్చు రూ.188.56 కోట్లని.. గత ప్రభుత్వంలో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సులు కేవలం 86 ఉంటే.. ఈ ప్రభుత్వం వాటిని ఏకంగా 216కి పెంచిందన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో కాల్‌ అందిన తర్వాత ఘటనా స్థలానికి 108 వాహనాలు చేరడానికి నిర్దేశిత సమయం 15 నిమిషాలు కాగా 14 నిమిషాల 17 సెకన్లకే చేరుకుంటున్నాయని తెలిపారు. రూరల్‌ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరాలని నిర్దేశించగా 17 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయన్నారు. గిరిజిన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, సరాసరి 17–23 నిమిషాల్లోనే చేరుకుని సేవలు అందిస్తున్నాయన్నారు.


గతంలో కేవలం 279 వాహనాలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య ఏకంగా 500కు పెంచిందన్నారు. వాహనంలో ఏసీ సదుపాయం కూడా ఉండటంతో గర్భిణులకు ఎంతో సౌకర్యంగా ఉంటోందన్నారు. ఈ ప్రభుత్వం ఒక ట్రిప్పునకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.895 ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక 104 సేవల్లో పూర్తిగా మార్పులు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయడానికి వీలుగా అదనంగా మరో 260 వాహనాలు కొనుగోలు చేశారన్నారు. మొత్తంగా 910 మొబైల్‌ క్లినిక్‌ యూనిట్లను ప్రవేశపెట్టారన్నారు.


వైద్య ఆరోగ్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం నాలుగేళ్లలోనే దాదాపు 50,000 పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. నాడు – నేడు ద్వారా దాదాపు రూ.16,800 కోట్లు ఖర్చు చేస్తోందని.. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు, అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలు, మూడు క్యాన్సర్, ఒక కిడ్నీ ఆసుపత్రి, ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తోందన్నారు. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1000 చికిత్సలు ఉంటే.. వాటిని ఈ ప్రభుత్వం 3,255కి పెంచిందన్నారు. చికిత్స తరవాత కోలుకునేవరకూ కూడా వారికి అండగా నిలుస్తూ వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కూడా ఈ ప్రభుత్వమే అందిస్తోందన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com