గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోదర గ్రామం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa