రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి దళితుడిపై మూత్రం పోసి, అతనితో కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీణా బూట్లు నాకించాడు. జూన్ 30న ఈ ఘటన జరగగా, జులై 27న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యతో కలిసి పొలంలో పనిచేసుకొంటుండగా పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి లాక్కెళ్లారని, అక్కడ డీఎస్పీ శివకుమార్ తనపై మూత్రవిసర్జన చేసి, ఎమ్మెల్యే బూట్లు నాకించాడని తెలిపాడు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ పొలంలో ఎలా దిగుతావని పోలీసులు బెదిరించారని వాపోయాడు.