మత్తుమందు ఇచ్చి ఎస్సై తనపై అత్యాచారం చేసాడని ఓ యువతి బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్స్టేషన్లో గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్వలీ తనను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అశ్లీల చిత్రాలు తీశాడని, వివాహం చేసుకోమని కోరగా చంపుతానని బెదిరించినట్లు పట్టణానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.