గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) పరిధిలో పనిచేస్తున్న FTEలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి మూల వేతనానికి 23 శాతం అదనంగా పెంచుతున్నట్లు పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 4,569 మంది FTEలకు లబ్ధి చేకూరనుంది.