కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన డాక్టర్ మాచర్ల రాధ హత్య కేసులో.. పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్నాథ్ మహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనితో పాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలే హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు.