ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో రెండువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలో శుక్రవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయమై వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.