గుంటూరుకు చెందిన వినోద్ కుమార్ జైన్ 18 సం. ల కిందట పత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో 6. 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో 3. 80 ఎకరాలను స్థానికంగా నివసించే ఆలేటి ప్రభావతితో పాటు మరికొందరు ఆక్రమించేందుకు కొద్దిరోజుల కిందట భూమి చుట్టూ ఎమ్మార్పీఎస్ జెండాలు పాతారని వినోద్ కుమార్ జైన్ శుక్రవారం పత్తిపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.