వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో 28 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. రెండు వర్గాలకు చెందిన వారి ఇళ్ల వద్ద రాళ్లు, సీసాలు నిల్వ చేసుకున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేసి అలాంటివి ఏమీ లేవని తెలిపారు. వట్టిచెరుకూరు, పెదనందిపాడు ఎస్సైలు, పది మంది పోలీసులతో ఎస్సీ కాలనీలో పికెట్ నిర్వహిస్తున్నారు.