బాపట్ల జిల్లాకు విచ్చేసిన లోకాయుక్త చెర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. బాపట్ల మండలం పాండురంగాపురం నందు జస్టిస్ లక్ష్మణా రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జస్టిస్ లక్ష్మణా రెడ్డి వ్యక్తిగత పనిపై ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం.