జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అదాలతో సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనోవర్తి కేసులు, ఫ్రీ లిటిగేషన్, కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.