గుంటూరు జిల్లాలో ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు శర్మకు, అదేవిధంగా హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహిళా హోంగార్డు దానాల రమణ కుటుంబ సభ్యులకు గుంటూరు జిల్లాలోని హోంగార్డులు ఒక్కొక్క రోజు వేతనాన్ని వితరణగా అందించారు. ఈమేరకు శుక్రవారం గుంటూరు నగరం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అదనపు ఎస్సీ సుప్రజ చేతుల మీదుగా ఆయా చెక్కులను శర్మ, రమణ కుటుంబ సభ్యులకు అందజేశారు.