ఇంజినీరింగ్ పూర్తి చేసిన త్రివేణికి జాబ్ ఉందని వాట్సప్ కు ఒక మెసేజ్ రాగా రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి 20 టాస్క్ లు పూర్తి చేస్తే ఉద్యోగం ఇస్తామని నమ్మించారు. ఆమె 4 టాస్క్ నిమిత్తం రూ. 4. లక్ష వరకు ఖర్చు పెట్టారు. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి త్రివేణి నెంబర్ ను తొలగించారు. మోసపోయానని గ్రహించిన యువతి శుక్రవారం అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కింద పోలీసులుకేసు నమోదు చేశారు.