ఓ యువతి పెళ్లైన ప్రియుడిని అపహరించి అతనితో బలవంతంగా తాళి కట్టించుకున్న ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. చెన్నై వేళచ్చేరికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పార్తిబన్, సౌందర్య ప్రేమించికుని విడిపోయారు. జులై 5న పార్తిబన్ మరో యువతిని వివాహం చేసుకోగా, సౌందర్య బంధువుల సాయంతో శుక్రవారం అపహరించి ఓ ఆలయంలో బలవంతంగా తాళి కట్టించుకుంది. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.