మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన బీజేపీ నేత సనా ఖాన్‌ను.. ఆమె భర్త అమిత్ సాహు హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, అమిత్ మధ్య గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు ఘర్షణకు దారితీయడంతో అమిత్ దెబ్బలకు ఆమె మరణించింది. మృతదేహాన్ని హిరన్ నదిలో విసిరేశానని విచారణలో అమిత్ అంగీకరించాడు.