గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తోన్న ఆరోగ్య పథకం వీరికీ వర్తించనుంది. సచివాలయ, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పని చేసే ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు సీఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. సెప్టెంబర్ చివరి నాటికి అందరికీ EHS కార్డులు అందించనున్నట్లు తెలిపారు.