పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుంటున్నా వారికి ఆ దేశ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది. గతంలో వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కని వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను విడుదల చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. సెప్టెంబర్ రెండో వారంలోపు అమెరికా విద్యాసంస్థలు ఫాల్ సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa