తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. అలిపిరి నడక మార్గంలో వంద మందిని ఓ గుంపుగా పంపిస్తున్నారు. వీరితో పాటు ఓ సెక్యూరిటీ గార్డు సైతం ఉన్నారు. మరోవైపు, చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.