అమెరికా, చైనాలో కరోనా న్యూ వేరియంట్ ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ ప్రమాదమేమీ కాదని, మరణ ముప్పు తక్కువేనని తెలిపింది. భారత్ లో ఈజీ.5 వేరియంట్ మేలో వెలుగు చూసినట్లు కేంద్రం తెలిపగా, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఓ సర్వే హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లో కొవిడ్ లక్షణాలతో చాలామంది బాధ పడుతున్నట్లు తెలిపింది.