టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం కడపలోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి లక్ష్మీ ప్రసన్న, చంద్రశేఖర్, అరుణాదేవి, మస్తాన్ రెడ్డి, వెంకటసాయి, ప్రత్యూష్ రెడ్డి తదితరులతో కలిసి వెళ్లి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిని పరామర్శించారు.