దేశంలో జనరిక్ ఔషధాల వినియోగాన్ని పెంచేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్సలో భాగంగా రోగులకు కేవలం జనరిక్ ఔషధాలనే సూచించాలని స్పష్టం చేసింది. అలా చేయని వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కొంతకాలం ప్రాక్టీస్ చేయకుండా లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే, మందుల చీటీల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలని వైద్యులకు సూచించింది.