మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఆయన నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో 145 పేజీలతో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ ఛార్జిషీటులో సీబీఐ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది.