తిరుమల నడకదారిలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నేడు ఉదయం కొందరు భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. భక్తుల కేకలకు చిరుత అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. కాగా, ఉదయమే ఓ చిరుత బోనుకు చిక్కిందని భక్తులు, టీటీడీ ఊపిరి పీల్చుకునేలోపే, మరో చిరుత సంచారం కలకలం రేపింది.