ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న దుర్ఘటనలను కారణమైన దోషులను శిక్షించాలని ముద్దనూరులో క్రైస్తవులు ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ముద్దనూరులోని అన్ని చర్చిలలో ప్రార్థనలు చేసే క్రైస్తవ సోదరులందరూ పట్టణంలోని నాలుగు రోడ్ల వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.