స్థానిక లయన్స్ క్లబ్ అనుబంధ క్లబ్ ల ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని ఆర్పీఎస్ సీవీఎస్ హైస్కూల్లో ఆదివారం చర్మవ్యాధులు, రక్త నాళాలకు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 30 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ణయించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నక్కా కోటేశ్వరమ్మ, అధ్యక్షుడు రావి చంది మణి తదితరులు పాల్గొన్నారు.