యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గీతామందిరంలో ఈ నెల 20న ఉమ్మడి గుంటూరు జిల్లా యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు అంకమ్మరావు, కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 8 నుంచి 45 సంవత్సరాలు పైబడిన పురుషులకు, మహిళలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.