ముద్దనూరు రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ఓ మహిళ ఆదివారం దుర్మరణం చెందింది. ఎర్రగుంట్ల రైల్వే ఎస్సై రారాజు వివరాల ప్రకారం.. వేంపల్లె మండలం కుప్పలపల్లెకు చెందిన కుళ్ళాయమ్మ(50) ముద్దనూరులోని 2వ ప్లాట్ ఫాంలో రైలు దిగి 1వ ప్లాట్ఫాంలోకి ట్రాక్ పై నడిచి వస్తోంది. అదే సమయంలో వచ్చిన రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.