పద్ధతి ప్రకారం తండ్రీకొడుకులు, దత్తపుత్రుడు, దివాళా తీసిన కొన్ని పార్టీల నాయకులు ఫుల్ సైజ్ ఆర్కెస్ట్రాలా చేస్తే శబ్ద కాలుష్యం రాష్ట్రం భరించలేని పరిస్థితికి వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యజమాని చంద్రబాబు డైరెక్షన్లో సినిమాల్లో నటుడిగా ఉన్న అనుభవాన్ని రాజకీయ మీటింగ్ల వేదికల మీద పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడన్నారు. పవన్ మాట్లాడే మాటల్లో పూనకం, అరుపులు, కేకలు, తిట్లు తప్ప ఏమీ ఉండదన్నారు. పవన్ యజమాని వేషాలు మరీ అన్యాయంగా ఉన్నాయని, చంద్రబాబుకు మెగాలోమానియాక్ (అధికారం నా హక్కు, నా సొంతం అనుకోవడం) జబ్బు సోకి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.