రుషికొండలో నిర్మాణాలన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం భవనాలు కడుతుంటే మధ్యలో పవన్కళ్యాణ్, చంద్రబాబుకు వచ్చిన బాధేంటో అర్థం కావడంలేదన్నారు. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని నిన్న అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించిన వివరణ ఇచ్చానని, కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు, చూపించలేదన్నారు. అందుకే మరోసారి ఈ నిర్మాణాలపై స్పష్టత ఇస్తున్నానని, నిన్న మీడియా సమావేశంలో చెప్పిన మాటలు ఈనాడు దినపత్రికకు కరెక్టుగా వినిపించకపోతే మళ్లీ చెప్తున్నా.. తాను చెప్పిన నిజాలు రాయాలన్నారు.