స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇన్నేళ్లలో రూ.4 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడితో శ్రీకాకుళం ప్రాంతంలో పోర్టు నిర్మిస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్‌కే సొంతమని ధర్మాన తెలియజేసారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి రూ.700 కోట్లు ఖర్చు చేసి హీరమండలం నుంచి పైపులైన్ ద్వారా శుద్ధ జలాలను రప్పిస్తున్నారు ఇదీ వైయస్ జగన్ ఘనతే.. చంద్రబాబు నాయుడు ఏనాడైనా శ్రీకాకుళం ప్రాంతం గురించి, ఉద్దానం సమస్య పరిష్కారం గురించి ఆలోచన చేశాడా..? ఏ అర్హత ఉందని శ్రీకాకుళం గురించి మాట్లాడుతున్నాడని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.