కాపులకు పూర్తిస్థాయిలో సహాయం అందించి వారి పక్షాన నిలిచింది వైయస్ఆర్ కుటుంబం మాత్రమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు అన్నారు. గుంటూరులో వైయస్ఆర్ సీపీ కాపు ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్న మేలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, కులాన్ని అడ్డం పెట్టుకొని పవన్ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలో కాపులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడని గుర్తుచేసుకున్నారు.