వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ పారదర్శకమైన పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వైయస్ఆర్ సీపీ విజయం ఖాయమైందని, అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.