ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా నెల్లూరులో 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ వరు సాగిన ఈ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొంది. ర్యాలీలో గాంధీ, చాచా నెహ్రూ, అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్ వంటి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ అజాదికా అమృతోత్సవం, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు చేపట్టి భారత్ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa