దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 19,350 దిగువన కదలాడింది. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 222 పాయింట్లు నష్టపోయి 65,179 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో 19,354 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోతుండగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, షేర్లు లాభాల్లో ఉన్నాయి.