ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 లక్ష్యానికి చేరువ అవుతోంది. చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా కక్ష్యలో చేరినట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. సైంటిస్టులు 153 కి.మీ x 163 కి.మీ కక్ష్యలోకి చంద్రయాన్-3 వ్యోమనౌకను విజయవంతంగా ప్రవేశపెట్టారని ఇస్రో పేర్కొంది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరు అవుతుందని, 23న చంద్రుడిపై ల్యాండింగ్ కానుందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa