ఏపీ పాలిటిక్స్‌లో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. తన మిత్రుడికి దగ్గర బంధువు అయిన అమ్మాయితో ఈ నెల 19న నిశ్చితార్థం చేసుకోనున్నారని, అక్టోబర్‌లో పెళ్లి ఉంటుందని సమాచారం. రాధా ఇక పెళ్లి చేసుకోరని అనుకున్న సన్నిహితులంతా ఈ వార్త విని ఆశ్చర్యపోతున్నారు. 2004లో విజయవాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.